Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చల్లటి పాలు తాగితే ప్రయోజనాలేంటి?

మంగళవారం, 30 మే 2017 (13:18 IST)

Widgets Magazine
milk

పాలు. శ్రేష్టమైన బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు దాగివున్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఐరన్ తక్కువగా ఉంటుంది. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం. పాలు ఆవులు, గేదెల నుంచి సేకరిస్తుంటారు. ఈ పాలను తాగేందుకు ప్రతి ఒక్కరూ తాగేందుకు ఇష్టపడతారు. కొందరు వేడిగా తాగితే మరికొందరు చల్లగా పాలు తాగుతారు. ఇంకొందరు హార్లిక్స్, బూస్ట్ వంటి వాటిలో కలుపుకుని తాగుతుంటారు. అయితే, చల్లటి పాలు తాగితే ప్రయోజనాలేంటి? అనే అంశాన్ని పరిశీలిస్తే... 
 
చర్మం కాంతిమంతంగా ఉండాలంటే రోజూ పాలు తీసుకోవాలి. రాత్రివేళ చల్లటి పాలు తాగితే చర్మసౌందర్యం మెరుగవుతుంది. ఉదరభాగం చుట్టూ కొవ్వు పెరుకుపోతుందని భయపడే వారు రోజు పాలను తాగండి. ప్రతి రోజూ పాలతో పాటు వాటి ఉత్పత్తులను సేకరించటం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పూర్తిగా లేదా తక్కువ పాలను తాగే వారితో పోలిస్తే రోజు పాలను తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా కలుగుతాయని పరిశోధనలలో వెల్లడించబడింది. 
 
పాలు తాగటం వలన శరీర బరువు పెరుగదు కదా... పాల ఉత్పత్తులను రోజు వారు అనుసరించే ఆహారంలో కలుపుకోవటం వలన వారి శరీరం ఫిట్‌గా, సన్నగా ఉంటుందని పరిశోధనలలో వెల్లడించబడింది. తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు గల పాలను పాల ఉత్పత్తులను రోజు తాగటం వలన స్థూలకాయత్వం కలగదని వెల్లడించారు. 
 
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ డైట్‌ తప్పనిసరి. సోయా పాలు, ఎరుపు, పసుపు రంగు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ రోజుల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బయటకు వెళ్లి వచ్చిన తరువాత తప్పనిసరిగా నేచురల్‌ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారమంతా బిజీగా ఉన్నా వీకెండ్‌లో తప్పనిసరిగా ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతో చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ అయితే మరీ మంచిది.
 
స్కిన్‌ టోన్‌ పెరగాలంటే తేయాకులను మరిగించి ఆ నీరు చల్లారిన తరువాత ఒక స్పూన్‌ తేనె కలిపి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది. రెండు, మూడు టేబుల్‌స్పూన్ల పచ్చిపాలు, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆస్తమా వస్తే ఇక శాశ్వతంగా వుండిపోతుందా...?

ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండూ వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటికి సంబంధం వుంది. ...

news

గంజినీళ్లు తాగితే మేలేంటి?

తాతల ముత్తాల కాలంలో ఉదయం పూట అల్పాహారంగా గంజినీళ్లు తాగేవారు. అంబలి తాగేవారు. కానీ ...

news

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే?

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే అవి త్వరగా తగ్గుతాయట. బొప్పాయిలోని ...

news

వేసవిలో దప్పికను అరికట్టే రాగి జావ.. జుట్టు వత్తుగా పెరగాలంటే?

రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. ...

Widgets Magazine