శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 9 మార్చి 2017 (18:59 IST)

వేపాకును నూరి శనగ గింజంత మాత్రలా చేసి వేసుకుంటే...

వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది. వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.

వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
 
అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది. చందన అత్తరు పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.