శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (17:11 IST)

దంత సమస్యలకు ఉల్లి రసం, వేడినీటితో చెక్!

దంత సమస్యలను దూరం చేసుకోవాలా..? అయితే ఉల్లి, వేడినీటిని ఉపయోగించండి. ఎలాగంటారా? పంటి నొప్పి, చిగుళ్లలో పెయిన్, వాపును దూరం చేసుకోవాలంటే.. తేలిక పాటి వేడినీటిలో ఉల్లిపాయ రసాన్ని కలిపి.. ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది. తర్వాత ఉల్లి రసాన్ని కాటన్‌ను తీసుకుని పళ్లపై మసాజ్ చేస్తే దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు.  
 
రాత్రిపూట ఆకుకూర అన్నం తింటే?
రాత్రిపూట ఆకుకూర, మిరియాలు, వెల్లుల్లి పాయలు సమానంగా తీసుకుని కూరలా తయారు చేసి తీసుకుంటే శరీరం తేలిక అవుతుంది. ఒళ్లు నొప్పులు వుండవు. 
 
పేగు రుగ్మతలు, నులిపురుగులు తొలగిపోవాలంటే.. 
పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే.. నులిపురుగులకు మందివ్వండి. వెల్లుల్లి ముప్పావు వంతు మిరియాలు మాత్రం కాసింత దంచి ఆ రసాన్ని పిల్లలకు ఇస్తే ఉపశమనం లభిస్తుంది.