శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 మార్చి 2016 (13:23 IST)

అధిక రక్తపోటుకు దివ్యౌషధం దాల్చినచెక్క.. కొబ్బరి నీరు తాగితే..?

అధిక రక్తపోటును నియంత్రించే నువ్వుల నూనె..!

అధిక రక్తపోటుకు దివ్యౌషధంగా దాల్చిన చెక్క పనిచేస్తుందట. మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చినచెక్కలోని వృక్ష రసాయనాలు గుండె కండరాలు, రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
సాధారణంగా అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవడంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటంటే...? 
 
కొబ్బరి నీరు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది. 
 
అలాగే నువ్వుల నూనె అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. నువ్వుల నూనెతో బహుళ అంసతృప్త కొవ్వు ఆమ్లాలతో పాటు సిసమిన్‌ అనే రసాయనమూ ఉంటుంది. ఇవి రక్తనాళాల గోడలు వదులుగా ఉండేలా చేస్తూ హఠాత్తుగా రక్తపోటు పెరగకుండా చూస్తాయి. ఈ నూనెను అన్నం, సలాడ్ల మీద కొద్దిగా వేసుకొనీ తినొచ్చు. ఇంకా పచ్చని ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు. 
 
ఇలా చేయడం ద్వారా మెదడులో హాయిని కలిగిస్తాయి. ఈ తరంగాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి ప్రకృతి దృశ్యాలను చూసే అలవాటును పెంపొందించుకోవాలి. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం చేయాలి. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా రక్తనాళాలు వదులుగా అవుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది.