శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (11:55 IST)

బియ్యం కడిగిన నీటిని తలకు రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే?

బియ్యం కడిగిన నీళ్ళలో అనేక లాభాలున్నాయి. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు… ముఖారవిందాన్ని కూడా పెంచుతుంది. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే

బియ్యం కడిగిన నీళ్ళలో అనేక లాభాలున్నాయి. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు… ముఖారవిందాన్ని కూడా పెంచుతుంది. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే.. దూదిని నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా మృదువుగా తయారవుతుంది.
 
బియ్యం కడిగే నీటిలో విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా.. జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయి. మహిళలు శిరోజాల అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ముఖ్యంగా జుట్టు పొడవుగా, ఒత్తుగా పెంచుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఇందుకోసం బ్యూటీపార్లర్లకు వెళ్ళకుండా బియ్యం కడిగిన నీటినే ఔషధంగా ఉపయోగిస్తారు. 
 
చైనా దేశంలోని యావో తెగ మహిళలు జుట్టును కత్తిరించుకోరట. అందుకే వీరి జట్టు పొడవు ఏడు నుంచి పది అడుగుల వరకు ఉంటుంది. అయితే, వీరంతా జట్టు పెరగడానికి, ఒత్తుగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? జుట్టు ఒత్తుగా పెరగడానికి బియ్యం కడిగిన నీళ్లు తలకు బాగా రాసుకుని ఒక గంట తర్వాత తలా స్నానం చేసేస్తారట. అందుకే బియ్యం కడిగిన నీటిని వృధా చేయకుండా వాడుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.