శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (14:26 IST)

ఫాస్ట్‌ఫుడ్స్ అధికంగా తినడం వల్ల కలిగే అనర్థాలేంటి?

సాధారణంగా ప్రతిరోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీతినీ విసుగుపుడుతుంది. దీంతో ఫాస్ట్‌ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇలాంటి ఆహారం కోసం ఎక్కువగా మారాం చేస్తుంటారు. ఫాస్ట్‌ ఫు

సాధారణంగా ప్రతిరోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీతినీ విసుగుపుడుతుంది. దీంతో ఫాస్ట్‌ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇలాంటి ఆహారం కోసం ఎక్కువగా మారాం చేస్తుంటారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడిన పిల్లలు మళ్లీ సాధారణ ఆహారం తీసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడరు. నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా ఫాస్ట్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండలేరు. అయితే, ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవడం అనేక అనర్థాలు ఉన్నాయి. 
 
ముఖ్యంగా పేగు క్యాన్సర్ దరిచేరే అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్యకు గురవుతారు. టైప్‌2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. అన్నిటికంటే ప్రధానంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే, గుండె పనీతీరు బాగా మందగిస్తుంది. ఒబేసిటీ బారిన పడే ప్రమాదం ఉంది.