శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (16:52 IST)

పొట్ట రాయిలా ఉందా..? అజీర్తి వేధిస్తుందా? తిన్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగండి

''తింటే ఆయాసం తినకుంటే నీరసం'' అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది అనే మాట కొందరు పదే పదే అంటుంటారు దీనికి కారణం అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం

''తింటే ఆయాసం తినకుంటే నీరసం'' అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది అనే మాట కొందరు పదే పదే అంటుంటారు దీనికి కారణం అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. వినడానికి చిన్నసమస్యగానే ఉన్నా దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో లభించే ఆహారపదార్ధాలతోనే అజీర్తిని నివారించవచ్చు.
 
ఒక గ్లాస్‌ వేడి నీటిలో అరస్పూన్‌ నిమ్మ రసం, అరస్పూన్‌ అల్లం రసం, స్పూన్‌ తేనే కలిపి తాగితే అజీర్తి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆహారం తిన్న తరువాత త్వరగా జీర్ణం కావాలంటే ఆరెంజ్‌ జ్యూస్‌ తాగితే మంచిది. 
 
ఆహారంలో ద్రాక్ష పండ్లని తీసుకుంటే అజీర్ణం నుండి విముక్తి పొందుతారు. ద్రాక్షలో ''సి విటమిన్'' అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత వీటిని తీసుకుంటే అరుగుదల బాగా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది. అజీర్తితో కడుపులో నొప్పిగా ఉన్నపుడు అరస్పూన్‌ వంట సోడాను గ్లాస్‌ నీటిలో కలిపి, ఆ నీటిని తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. 
 
ప్రతి రోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి పెరుగుతుంది.