శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (09:17 IST)

సమ్మర్ టిప్స్ : ఎండదెబ్బ - వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే?

ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయ్. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఈ ఎండవేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. దీనికితోడు.. ఉక్కపోతతో వడదెబ్బకు గురవుతున్నారు. ఈ కారణంగా మనిషి తీవ్ర అస్వస్థతకు గురవుతున్న

ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయ్. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఈ ఎండవేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. దీనికితోడు.. ఉక్కపోతతో వడదెబ్బకు గురవుతున్నారు. ఈ కారణంగా మనిషి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడు. దీనికితోడు ఎండ వేడి వల్ల శారీరకంగా రకరకాల సమస్యల బారిన పడుతుంటారు. ఆ బాధలేమిటో ఓసారి పరిశీలిస్తే... 
 
ఎండలో బాగా తిరగడం వల్ల శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. దీంతో బాగా బలహీనపడతాం. రక్తపోటు (బ్లడ్‌ప్లజర్) పడిపోతుంది. తలనొప్పి, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లటి ప్రదేశంలో కెళ్లి కూర్చుంటే మంచిది. నీళ్లు బాగా తాగాలి. వేసవిలో వచ్చే మరో సమస్య హీట్‌ క్రాంప్స్‌. ఫిజికల్‌గా బాగా శ్రమపడ్డా, శరీరంలో ఎలక్ట్రోలైట్‌ సమతుల్యత లోపించినా హీట్‌ క్రాంప్స్‌ వస్తాయి. దీంతో బాధపడేవారు మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మకాయనీళ్లు వంటివి బాగా తాగాలి. 
 
ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలంటే రోజుకు 3-4 లీటర్ల ఫ్లూయిడ్స్‌ను తాగాలి. నాన్‌ కేఫినేటెడ్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ డ్రింకులను మాత్రమే తాగాలి. విపరీతంగా చల్లగా ఉన్న ద్రవపదార్థాలను తీసుకోకూడదు. అలా చేస్తే స్టొమక్‌ క్రాంప్స్‌ వచ్చే అవకాశం ఉంది. దాహంగా లేకపోయినా నీళ్లు తాగుతూ వుండాలి. బయటకు వెళ్లినప్పుడు గంటకొకసారి గ్లాసుడు మంచినీళ్లు లేదా జ్యూస్‌ విధిగా తీసుకోవాలి. 
 
నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కీర, పైనాపిల్‌లాంటి ముక్కలి అపుడపుడూ తీసుకుంటుండాలి. చెమటను పీల్చే నేత వస్త్రాలను ధరించడం ఎంతో ఉత్తమం. అయితే, వేసవిలో ధరించే దుస్తులు బిగుతుగా ఉండకుండా కాస్తంత లూజుగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఎండలో బయటకెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు లేదా తలపై టోపి పెట్టుకోవాలి. లేదా తడిపిన కర్ఛీఫ్‌ని తలకు చుట్టుకోవాలి.