Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చింత గింజల పొడిని పాలతో తీసుకుంటే...

బుధవారం, 9 ఆగస్టు 2017 (22:37 IST)

Widgets Magazine
Tamarind seeds

చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌ర్వాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్నచిన్న ముక్క‌లుగా చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి. 
 
ఈ పొడిని జార్‌లో నిల్వ ఉంచుకుని ప్రతి రోజూ అర టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుంచి 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. 
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌టం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు ...

news

స్మార్ట్‌ఫోన్లు మైకంలో యువత: డేటింగ్ లేదూ.. ఫ్రెండ్సూ లేరు.. గదిలోనే కూర్చుని ఒంటరివారైపోతున్నారు..

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం ...

news

రోజూ స్కిప్పింగ్ చేయండి.. బరువు తగ్గండి..

రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య ...

news

పండ్లను శుభ్రంగా కడిగి తినకపోతే..?

పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? ...

Widgets Magazine