శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (14:53 IST)

కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి?

కిడ్నీల పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. మానవ దేహంలో కిడ్నీల పనితీరు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ఆరోగ్యానికే కాదు.. ప్రాణానికే ముప్పు తప్పదు. అందుకే కిడ్నీలను పదిలం చేసుకోవాలంటే ముఖ్యంగా బరువును నియంత్రించుకోవాలి.
 
టిప్స్ ఇవిగోండి.. 
* వయస్సుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. 
* అధికబరువును తగ్గించుకోవాలి. 
* రోజూ వ్యాయామం తప్పనిసరి
* ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
 
* తాజా పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో ఉండాలి. 
* వంటచేసేటప్పుడు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి.   
* ఉప్పును మితంగా వాడాలి . 
* రక్తపోటును నియంత్రించుకోవాలి.  
 
* అప్పడప్పుడు బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్‌ను పరిశీలించాలి. 
* మద్యపానం, ధూమపానానికి చెక్ పెట్టాలి.
 
* వంశపారంపర్యంగా కిడ్నీ జబ్బులున్నాయా అనేది ఆరా తీయాలి. ఒకవేళ ఉంటే వైద్యుల సలహాలు పాటించాలి.
 
* మాంసాహారాన్ని పరిమితం తీసుకోవడంతో పాటు చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.