గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (15:15 IST)

డీప్ టిష్యూ మసాజ్‌తో ఆ నొప్పి మటాష్...

మసాజ్‌లు చేయించుకోవాలంటే చాలా మంది అయిష్టత వ్యక్తం చేస్తారు. కానీ, మసాజ్ చేయించుకున్న వారికి అవిచ్చే ఉపశమనం మాత్రం మాటల్లో చెప్పలేం. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాంటి మసాజ్‌లలో డీప్ టిష్యూ మసాజ్ ఒకటి. దీన్ని చేయించుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
ప్రతి రోజూ వర్కౌట్లు చేయలేని వారికి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికొకసారి ఈ మసాజ్‌ని చేయించుకోవాలి. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మెదడు, శరీరం బాగా రిలాక్స్‌ అవుతాయి. 
 
అంతేకాదు శరీరంలో తలెత్తే రకరకాల నొప్పుల్ని, బాధల్ని ఈ మసాజ్‌ పోగొడుతుంది. ఈ మసాజ్‌ వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో సేదదీరుతారు. 'టెక్స్టింగ్‌ నెక్' (మొబైల్‌లో తరచూ మెసేజ్‌లిస్తుండడం వల్ల మెడకు తలెత్తే నొప్పులు), 'హంచ్డ్‌ ఒవర్‌ లాప్‌టాప్‌ సిండ్రోమ్' (హెచ్‌ఔల్‌ఎస్‌) సమస్యలు కూడా తగ్గుతాయి.