Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుండలు చేసే వారు కంప్యూటర్లు తయారు చేస్తున్నారు.. యోగాతో అన్నీ సాధ్యమే

సోమవారం, 28 ఆగస్టు 2017 (19:55 IST)

Widgets Magazine
Sadguru

యోగా అంటే ఆసనాలు, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు అనుకోకూడదు. యోగా అంటే సమస్థితిలో ఉండటం అని అర్థం. శరీరం, మనసు ఆత్మ- ఈ ఉనికితో సంపూర్ణంగా అనుసంధానం అవ్వడమే యోగా. సంతోషంగా ఉన్నప్పుడు ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. తిన్నా, తినకపోయినా, సరిగా నిద్రపోయినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొద్దిపాటి సంతోషమే శక్తి సామర్థ్యాలను పెంచుతోంది. అలాంటిది యోగాతో అంతర్గత శక్తులను ఉద్దీపింపజేస్తే శరీరం, బుద్ధి, మనోభావాలు అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తాయి. 
 
మానవులంతా ఒకే శక్తితో తయారైనా.. అందరి పనితీరూ ఒకేలా ఉండదు. సామర్థ్యం, ప్రతిభ, తెలివితేటలు, పనులు చక్కదిద్దే శక్తి ఇవన్నీ పని విధానాలు మాత్రమే. ఈ శక్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా పని చేస్తుంటుంది. ఉదాహరణకు ఒక మొక్క గులాబీలను వికసింపజేస్తుంది. మరోవైపు మల్లెలను పూయిస్తుంది. ఇలా ఒకే శక్తి పలు రూపాల్లో వ్యక్తమవుతోంది.
 
మీలో నిగూఢమై ఉన్న శక్తిపై కొంత ప్రావీణ్యం సంపాదిస్తే.. అప్పుడు అసాధ్యమనుకున్న పనులను సునాయాసంగా పూర్తి చేయవచ్చు. యోగసాధన మొదలుపెట్టిన ఎంతోమంది ఈ అనుభవాన్ని రుచిచూశారు. మీకు కావాల్సిన పద్ధతిలో పరిస్థితులను సృష్టించుకునే ఆంతరంగిక శక్తిని యోగా అందిస్తుంది. ఒకప్పుడు భూమి నుంచి లభించిన ధాతువులతో కుండలు, పాత్రలు చేసే వారు.. ప్రస్తుతం అవే ధాతువులతో కంప్యూటర్లు తయారు చేస్తున్నారు. 
 
శక్తి అనేది ఒకటే దాన్ని ఉపయోగించే విధానమే వేరు. అందుకే మానవుడు ప్రతి విషయాన్ని పరిశోధించాలి. గమనించాలి. లేకుంటే.. అందుబాటులో ఉన్నవి చేస్తూ అలానే ఉండిపోతారు. తద్వారా జీవితం పరిమితంగా మారిపోతుంది. అలాకాకుండా.. అంతర్గత శక్తులను ఉత్తేజపరుచుకోవాలంటే.. శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలంటే యోగా సాధన చేయాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అతడు మిత్రుడు కాదు... అతి కోపం... అతి దయ(వీడియో)

మహాభారతంలో విదురుడు కురు రాజు ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలను విదుర నీతి అని తెలిసింది. ...

news

అవి జేబులో ఉంటే దరిద్రం వెంటాడుతుందా...?

మనం రోజూ దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను ...

news

కాణిపాకం వినాయకుడి గురించి అసలు నిజం తెలిస్తే?(వీడియో)

అందరి ఆరాధ్య దైవమైన బొజ్జగణపయ్య వేడుకలకు ప్రసిద్ధి ఆలయం కాణిపాకం ముస్తాబైంది. వినాయకుడు ...

news

మన శరీరంలో ఉన్న దివ్యచక్రాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

మనిషి శరీరంలోని యోగసాధకులు చక్రాలట. మొత్తం ఆరు చక్రాలు మన శరీరంలో అమరి ఉంటాయట. ఈ చక్రాలు ...

Widgets Magazine