Widgets Magazine

శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తే?

మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:00 IST)

జీవితంలో కష్టాలు లేని మనుష్యులే లేరు. ఆర్థిక పరమైన సమస్యల వలన అందరు సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యల వలన మనశ్శాంతిని కోల్పోయి ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు సహాయపడేవారు వరలక్ష్మీ అమ్మవారేనని గ్రంధాలలో చెప్పబడింది. సకల సౌభాగ్యాలు కూడిన ఈ వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన జీవితంలో ఏర్పడే ఎలాంటి సమస్యలనుండైన విముక్తి చెందవచ్చును.
  
 
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజున వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని తూర్పు దిశలో వరలక్ష్మీ అమ్మవారిని పీఠంపై ఉంచి తొమ్మిది పోగుల తోరమును ధరించి నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. 
 
అదే రోజున పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పువ్వులను, ప్రీతికరమైన నైవేదాలను సమర్పించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలాలు లభిస్తాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతేదేవికి చెప్పారట. అందువలన ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే ఆమే అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ప్రతి మంగళవారం 'హనుమాన్ చాలీసా' పఠిస్తే?

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ...

news

దక్షిణావర్త శంఖాన్ని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భివించింది. కనుక శంఖం లక్ష్మీదేవి స్వరూపమని చెబుతుంటారు. ...

news

బక్రీద్ పండుగ... త్యాగానికి ప్రతీకగా...

ముస్లింల రెండో పెద్ద పండుగ బక్రీద్. త్యాగానికి, దేవునిపై భక్తికి ఈ పండుగు తార్కాణంగా ...

news

ద్రౌపదీ శ్రీకృష్ణుల సోదర ప్రేమ.. రాఖీ బంధనాన్ని సూచిస్తుందట..

ద్రౌపది శ్రీకృష్ణుల సోదర ప్రేమ రాఖీ బంధనాన్ని సూచిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ...

Widgets Magazine