ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (19:36 IST)

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రాకు స్థానం.. క్వాంటికో సీరియల్‌తో..

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటీమణుల జాబితాలో అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్‌ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో ఈసారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటీమణుల జాబితాలో అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్‌ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో ఈసారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్-10లో మరోసారి నిలిచింది.

క్వాంటికో సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. జూన్ 1, 2016 నుంచి జూన్ 1, 2017 మ‌ధ్య కాలంలో టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా పది మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో 50 శాతానికి పైగా ఆదాయం ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే పొందిన‌ట్లు తెలిపింది. 
 
క్వాంటికో ద్వారా హాలీవుడ్ బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా.. కొద్దికాలంలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాలో కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది.

సోఫియా నటిస్తున్న ''మోడ్ర‌న్ ఫ్యామిలీ" టీవీ సిరీస్‌కు అమెరికాలో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో గ‌త ఆరేళ్ల నుంచి సోఫియా వెర్గారా ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో వుంది.