శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (17:44 IST)

గొంతునొప్పి: 3 బెస్ట్ హోం మేడ్ రెమెడీస్..!

అసలే వర్షాకాలం. గొంతునొప్పిగా వుందా? అయితే హోం మేడ్ రెమెడీస్‌ను ఫాలో చేయండి. అరచెంచా పసుపును ఒక కప్పు వేడి నీళ్ళలో లేదా వేడి పాలలో వేసి బాగా మిక్స్ చేసి వేడి వేడిగా తీసుకోవాలి. 
 
గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లైతే.. టర్మరిక్ వాటర్ చాలా స్మూత్‌గా నివారిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్స్‌ను పసుపు వేడినీళ్ళు చాలా ఎఫెక్టివ్‌గా నయం చేస్తాయి. 
 
ఇక రాస్బెర్రీ లీఫ్ టీతో త్రోట్ ఇన్ఫెక్షన్‌ను దూరం చేసుకోవచ్చు. రెండు చెంచాలా రాస్బెర్రీ ఆకులను తీసుకొని అందులో ఒక కప్పు వేడినీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తర్వాత వేరే కప్పులోకి ఫిల్టర్ చేసుకొని, చల్లారనివ్వాలి. తర్వాత ఈ నీటితో గార్గిల్ చేస్తే గొంతునొప్పి మాయమైపోతుంది. 
 
అలాగే అల్లం టీ కూడా గొంతునొప్పి దివ్యౌషధంగా పనిచేస్తుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్‌కైనా విరుగుడుగా పనిచేస్తుంది, కాబట్టి, గొంతు ఇన్ఫెక్షన్స్‌ను నివారించుకోవాలంటే ఒక కప్పు అల్లం టీను వేడి వేడిగా తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.