బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (10:44 IST)

గ్రీన్ టీ క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుందా.. ఎలా..?

గ్రీన్ టీ అంటే కొందరికి అంతగా నచ్చదు. కానీ, గ్రీన్ టీలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. నచ్చని వారు కూడా ఇష్టపడి తీసుకుంటారు. గ్రీన్ టీలో లభించే అమైనో ఆమ్లాలు, విటమిన్స్ వంటి ఖనిజాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధులను 80 శాతం వరకు నివారిస్తాయని లండన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు...
 
ఆకుల్లోని ఔషధ గుణాలను నానోపార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల మీద ప్రయోగించి చూడగా క్యాన్సర్ కణజాలం దాదాపు చనిపోయిన విషయాన్ని గుర్తించారు. దాంతో గ్రీన్ టీ తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవని అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు రోజూ గ్రీన్ టీ సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 
 
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి, సి, ఇ, కె, కాపర్, ఐరన్, జింక్, మాంగనీస్ వంటివి లభిస్తాయి. క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి గ్రీన్ టీ మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరి ఆ టీ ఎలా చేయాలో చూద్దాం.. ముందుగా నీరు వేడిచేసి అందులో కొన్ని గ్రీన్ టీ ఆకులు, నిమ్మరసం చక్కెర లేదా ఉప్పు వేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత వడగడితే అదే గ్రీన్ టీ.