శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (16:26 IST)

ఆరోగ్యానికే కాదు... అందానికీ యాపిల్ మేలు..!

శక్తివంతమైన పండు అనగానే గుర్తొచ్చేది యాపిల్ పండు. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే యాపిల్ ఆరోగ్యానికే కాదు అందానికి మరింత మేలు చేస్తుంది. కాకాపోతే ఉపయోగించే విధానం తెలుసుకుంటే సరి.
 
యాపిల్ ని గుజ్జుగా చేసి ఉడకబెట్టాలి. దానికి కొంచెం పాలల్లో నానబెట్టిన ఓట్స్‌ని జత చేసి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ అవిసె గింజల నూనెని కలపాలి. దీన్ని మెత్తని మిశ్రమంలా చేసుకుని ముఖానికీ, మెడకీ పూతలా వేయాలి. పది నిమిషాలాగి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మంపై నలుపురంగు తగ్గిపోవడమే కాకుండా కాంతివంతంగా మెరిసిపోతుంది. 
 
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండిషన్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.
 
ఎక్కువగా బయట తిరిగే వారి చర్మం బరకగా నిర్జీవంగా కనిపిస్తుంది. పావుకప్పు యాపిల్ గుజ్జులో, టీ స్పూన్ సెనగపిండీ, తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి పట్టించి బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
 
మొటిమల తాలూకు మచ్చలతో ముఖం కాంతి విహీనంగా కనిపిస్తున్నప్పుడు టేబుల్ స్పూన్ యాపిల్ గుజ్జులో స్పూన్ చొప్పున తులసి పొడీ, తేనె కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె, తులసి పొడీ రెండూ యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తాయి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.