పరగడుపునే అరటిపండ్లు తింటే ఏమౌవుతుంది?

ప్రకృతి ప్రసాదించిన పండల్లో అరటి పండు ఒకటి. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. పైగా, ఈ పండును ప్రతి రోజూ ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ సమస్యలకు దివ్యౌషధం.

banana
pnr| Last Updated: సోమవారం, 7 మే 2018 (12:05 IST)
ప్రకృతి ప్రసాదించిన పండల్లో అరటి పండు ఒకటి. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. పైగా, ఈ పండును ప్రతి రోజూ ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ సమస్యలకు దివ్యౌషధం. అలాంటి పండును పరగడుపునే అరటిపండ్లను తినవచ్చా? తింటే ఏమవుతుంది? అనే మీమాంశలో కొట్టుమిట్టాడుతుంటారు. మరి దీనికి వైద్యనిపుణులు ఎలాంటి సమాధానమిస్తున్నారో పరిశీలిద్ధాం.
 
వైద్య నిపుణుల అభిప్రాయంమేరకు.. అరటిపండ్లను పరగడుపున తినకూడదట. ఎందుకంటే అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అవి మనకు బాగా శక్తిని ఇస్తాయి. కానీ తర్వాత వెంటనే ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుంది. అలాగే అరటిపండ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి నిద్రవస్తుంది. 
 
ఉదయాన్నే అసలే నిద్రమత్తులో ఉంటాం. అలాంటపుడు పరగడుపున అరటిపండ్లను ఆరగించడం వల్ల మరింతగా నిద్ర మబ్బులోకి జారుకోవాల్సి వస్తుందట. పైగా, అరటిపండ్లు సహజసిద్ధంగానే యాసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయని అందువల్ల అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినరాదని వైద్య నిపుణులు చెపుతున్నారు. దీనిపై మరింత చదవండి :