గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (14:11 IST)

జియోకు పోటీగా వోడాఫోన్ న్యూప్లాన్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయిత

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయితే, ఈ ధరల యుద్ధం తగ్గింపులో జియోతో పోటీపడలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.349తో వారు రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 3జీబీ 3జీ/4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. అయితే జియోలో ఇంతే మొత్తానికి రీచార్జి చేయించుకునే కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. కానీ, ఈ ప్లాన్ కాలపరిమితి మాత్రం 70 రోజులు కావడం గమనార్హం.