శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (10:51 IST)

''మహానటి'' చిన్నప్పటి పాత్రలో రాజేంద్రప్రసాద్ మనువరాలు.. జబర్దస్త్ యాక్టర్‌కి కౌంటర్

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ''మహానటి''. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో.. సావిత్రి చిన్నప్పటి పాత్రలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవర

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ''మహానటి''. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో.. సావిత్రి చిన్నప్పటి పాత్రలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నిశంకర సావిత్రి నటించింది. అదే కార్యక్రమానికి సహ వ్యాఖ్యాతగా ఉన్న జబర్దస్త్ కమేడియన్ మహేష్‌కు నిశంకర సావిత్రి కౌంటరేసింది.
 
సావిత్రి గురించి ఏదైనా చెప్పాలని అడిగితే.. అస్సలు చెప్పొద్దని తాతయ్య చెప్పారని.. నిశంకర సావిత్రి చెప్పడంతో.. అందరూ నవ్వుకున్నారు. రాజేంద్రప్రసాద్ మనవరాలు సావిత్రి చిన్నప్పటి పాత్రలో నటించిందని చిన్న ముక్క తెలిసిందని మహేష్ చెప్పాడు. 
 
ఇక సావిత్రి ఆడియో ఫంక్షన్‌కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నిర్మాత స్వప్న ఓ రోజు తన వద్దకు వచ్చి మహానటి సినిమాలో గెస్ట్ రోల్‌గా తాతగారి వేషాన్ని వేయాలని కోరిందని.. కానీ తాను ఆ వేషం వేయలేనని తేల్చి చెప్పేశానన్నాడు. ఆయన వేషం వేసే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరిగే పనికాదన్నాడు.
 
తాతగారి పాత్రను పోషించే దమ్ము తనకు లేదని.. కానీ మహానటి సినిమాలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్.. జెమినీ గణేశన్‌గా దుల్కర్, సమంత, విజయ్‌లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని ఎన్టీఆర్ అన్నాడు. ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. కాగా, అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'మహానటి'లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అనుష్కా శెట్టి, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.