శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (17:15 IST)

రోజుకు 3 ఖర్జూరాలు చాలు...

సంప్రదాయ ఫలంగా నీరాజనాలందుకునే పండు ఖర్జూరం పండు. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే ఈ పండు లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు.

సంప్రదాయ ఫలంగా నీరాజనాలందుకునే పండు ఖర్జూరం పండు. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే ఈ పండు లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి ఖర్జూరం పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజుకు కేవలం మూడు ఖర్జూరాలను ఆరగిస్తే చాలు. హెల్తీగా ఉండటమేకాకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరవు. 
 
ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచి, రక్తకణాలను వృద్ధి చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆరగించడం వల్ల అనీమియా సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
ఖర్జూరం పండ్లలో జియాక్సిథిన్, టూటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇది బెస్ట్ ఐ విటమిన్‌గా పనిచేస్తుంది. క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉండటం వల్ల డయేరియాను నివారిస్తుంది. మలబద్దకం సమస్యకు ఈ పండ్లను ఆరగించడం వల్ల చెక్ పెట్టొచ్చు. 
 
ప్రసవానికి ఒక నెల ముందు నుంచి డేట్స్ తీసుకోవడం వల్ల ప్రసవ నొప్పులు, బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది. బాలింతలు వీటిని ఆరగిస్తే పాలు ఎక్కువగా పడతాయి. పరగడుపు డేట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.
 
ముఖ్యంగా హృద్రోగంతో బాధపడేవారు రోజుకు మూడు డేట్స్ చొప్పున తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్‌ను నానబెట్టి, ఆ నీటిని ఉదయం పరగడుపున తినాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు గుండెపోటు బారినపడకుండా ఉండొచ్చు. 
 
డేట్స్‌లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆరగించడం శరీరం త్వరితగతిన శక్తిని పొందుతుంది.