శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (14:12 IST)

పాపాయిని ఎలుక కొరికిందా.. ఏంచేయాలి..?

మనుషులకు అతి చేరువలో కనిపించే జీవరాశుల్లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు వంటి ఉన్నాయి. అయినా ఇవి కరిస్తే ప్రమాదమే. వీటిలో ఎలుకలు అతి చిన్నవిగా కనిపించినా విషం ఎక్కువే. సాధారణంగానే ఎలుకలు చెత్తా - చెదారాల్లో తిరుగుతుంటాయి. కాబట్టి అనేక రోగ క్రిములను కలిగి ఉంటాయి. 
 
ఎలుక కాటు వలన పెద్ద వారికి అంతగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోయినా, పిల్లలకు మాత్రం వెంటనే వ్యాధి సోకవచ్చును. ఎలుక కరిస్తే  హఠాత్తుగా చలిజ్వరము, గొంతులో మంట, నరాల బలహీనత, చర్మం ఎర్రగా మారిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కలిపిస్తాయి. అటువంటి సమయంలో ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్ వేయించుకోవాల్సి ఉంటుంది. 
 
అది కుదరకపోతే ఇంట్లోనే వైద్యం చేసుకుని ఉపశమనం పొందవచ్చు. ఒక చెంచా తేనెలో పది చుక్కల వెల్లుల్లి రసం బాగా రంగరించి ఒక కప్పు వేడి నీటిలో కలిపి ఉదయం పూట పరకడుపున తాగాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చొప్పున తాగితే సరి. అదేవిధంగా మారెడు ఆకులను రోజుకు ఆరు చొప్పున వారం రోజులుపాటు తిన్నా ఎలుక కాటు నుంచి ఉపశమనం పొందవచ్చు.