ఆ ఒక్క పండుతో ఆ వ్యాధికి శాశ్వత పరిష్కారం...

మన దేశంలో జనాభాలో సగానికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. జీవన శైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారికి దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది.

pomegranate
chj| Last Modified ఆదివారం, 28 జనవరి 2018 (21:01 IST)
మన దేశంలో జనాభాలో సగానికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. జీవన శైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారికి దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది.

దానిమ్మ చక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర పండ్ల వలనే కాకుండా దానిమ్మలో చక్కెరతో జత చేయబడిన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దానిమ్మలో టానిక్, గానిక్ అనే పిలువబడే అమ్లాలు టైపు 2 డయాబెటిస్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్‌ను నివారించగల యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ డయాబెటిక్ లక్షణాలను సమృద్థిగా కలిగి ఉంది.

డయాబెటిస్‌తో బాధపడేవారికి శరీరంలో కణజాలం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దానిమ్మ తీసుకోవడం వల్ల కలిగే మరో అత్యుత్తమ ప్రయోజనం ఏంటంటే ఇది శరీరంలో కణాలను డ్యామేజీల బారి నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కూడా దానిమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయడానికి దానిమ్మ గింజలు, ఆకులు, బెరడు కషాయాన్ని వాడతారు.

దీనిపై మరింత చదవండి :