ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (15:14 IST)

పరగడుపున నీరు ఎందుకు తాగాలంటే...

ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత ముఖ్యమో... మనిషి శరీరానికి నీరు అంతే అవసరం. అంటే మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే అదీ పరగడుపున నీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
 
* ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పరగడుపున నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. 
* పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. 
* శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. 
* రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. 
* బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి. 
 
* కండరాలు బలపడి చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగడం అవసరం. 
* చర్మ తగినంత తేమతో పాటు.. చర్మం సహజంగా, మృదువుగా ఉంటుంది. 
* జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేరకు పెరుగుతుంది. 
* మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.
* జీర్ణశక్తి, ఆకలి పెరుగుతుంది.