శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (14:41 IST)

కాశ్మీరీ ఛాయ్ టేస్ట్ చేశారా?

కాశ్మీరీ ఛాయ్ రోజ్ కలర్‌లో వుంటుంది. ఇందులో టీ ఆకులు, పాలు, ఉప్పు, బేకింగ్ సోడా కూడా వాడుతారు. కాశ్మీర్ లోయలో ఈ ఛాయ్‌ని ఎక్కువగా తయారీ చేస్తారు. ఉప్పు టీతో పరిచయం లేని కాశ్మీరేతరులకు ప్రత్యేక సందర్భాల్లో వివాహాల్లో, శీతాకాలంలో ఈ ఛాయ్‌ని అందిస్తారు.


దీన్ని నూన్ ఛాయ్ అని పిలుస్తారు. ఈ ఛాయ్‌ని కాశ్మీర్ ప్రజలు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలోనూ, రాత్రిపూట డిన్నర్ అయ్యాక తీసుకుంటారు. అలాంటి కాశ్మీర్ టీని ఎలా చేస్తారో ఈ రిసిపీ ద్వారా చూద్దాం. 
 
కావాలసిన పదార్థాలు 
గ్రీన్‌ టీ ఆకులు: 2 టేబుల్‌స్పూన్లు 
యాలకులు: నాలుగు 
పాలు: 3 కప్పులు 
పంచదార: రుచికి సరిపడా 
బేకింగ్‌సోడా: చిటికెడు 
దాల్చిన చెక్క: అంగుళం ముక్క 
అనాసపువ్వు: ఒకటి 
లవంగాలు: మూడు 
నీరు : పది గ్లాసులు 
 
తయారీ విధానం: 
మందపాటి గిన్నెలో ఆరు కప్పుల మంచినీళ్లు పోసి సిమ్‌లో మరిగించాలి. అందులో గ్రీన్‌ టీ ఆకు వేసి, మరో పది నిమిషాలు సిమ్‌లోనే మరిగించాలి. తర్వాత సోడా వేసుకోవాలి. ఇప్పుడు టీ రంగు గులాబీరంగులోకి మారిపోతుంది. వెంటనే మిగిలిన ఆరు కప్పుల చల్లని నీళ్లు పోసి వడబోయాలి. 
 
ఇప్పుడు వడబోసిన టీ కషాయంలో యాలకులపొడి, దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వు వేసి మూత పెట్టి సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత నెమ్మదిగా పాలు పోసి బాగా కలపాలి. చివరగా చిటికెడు ఉప్పు, పంచదార వేస్తే నోరూరించే కాశ్మీరీ చాయ్‌ రెడీ. దీన్ని బాదం, పిస్తాలతో కలిపి సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.