శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (16:22 IST)

బెడ్ రూమ్ విండోలకు గాలి గంటలు వేలాడదీస్తే..

బెడ్ రూమ్ విండోలకు గాలి గంటలు వేలాడదీయాలి. ఇల్లు మరింత ఆహ్లాదకరంగా, వ్యక్తిగతమైనదిగా సామాన్యమైన భావన ఇవ్వాలనుకుంటే కాలేజీ ఫోటోలను వేలాడదీసుకోవచ్చు. అలాగే బెడ్ రూమ్‌ విండోస్‌కు భాగస్వామితో తీయించుకున్న చిన్న చిన్న ఫోటోలతో కూడిన గాలి గంటల్ని తగిలించుకుంటే.. వెరైటీగా ఉంటాయి. 
 
అలాగే గోడల రంగులకు సరిపోయేలా డోర్ కర్టెన్లు, విండో కర్టెన్లు అమర్చుకోవాలి. అయితే అన్ని కర్టెన్లు కూడా ఒకే రంగులో ఉంటే చూసేందుకు బాగుండదు. కొన్ని రంగులకయితే వాటికి సరిపోయే రకం కర్టెన్లనే ఉపయోగించాలి. కర్టెన్లు ఎప్పుడూ బ్రైట్‌గా ఉండేవి ఎంపిక చేసుకోవడం వల్ల ఈ గది ఫీల్ ఫ్రెష్‌గా అనిపించవచ్చు.
 
అలాగే తెల్లని తాజా పువ్వులతో అలంకరించిన గ్లాస్ వాజ్ చాలా ఆహ్లాదకరమైన, మృదువైన లుక్‌ను తీసుకొస్తుంది. టేబుల్ లాంప్స్ లేదా తల దగ్గర లాంప్స్‌కు బదులు, బెడ్ లాండ్స్‌ను ఫ్లోర్ మీద పెట్టుకోవాలి. ఫ్లోర్ లాంప్స్ చాలా అధునాతనంగా... ఆకర్షణీయంగా కనబడుతాయని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు అంటున్నారు.