శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (13:37 IST)

వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత చిన్నారి పద్మాలయా నందా

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల తరహాలోనే వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు కూడా ప్రతి ఏడాది జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పాల్గొనేందుకు ఒడిశాకు చెందిన 12 ఏళ్ల చిన్న

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల తరహాలోనే వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు కూడా ప్రతి ఏడాది జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పాల్గొనేందుకు ఒడిశాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి ఎంపికైంది. ఈ ఏడాది వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు జార్జియాలో జరుగనున్నాయి.

ఈ పోటీల్లో భారత్ తరపున పద్మాలయా నంద అనే 12 ఏళ్ల చిన్నారి పాల్గొంటోంది. ఇటీవల కోహికోడ్‌లో జరిగిన మిస్ లిటిల్ జూనియర్ పోటీల్లో పద్మాలయా నంద కిరీటం గెలుచుకుంది. తద్వారా వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.
 
ఎనిమిదేళ్ల పద్మాలయా భారత్ తరపున లిటిల్ మిస్ యూనివర్స్ 2017కు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. మిస్ యూనివర్స్‌ కోసం జరిగిన ఆడిషన్ థ్రిలింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది. లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో ధీటుగా రాణించేందుకు వంద శాతం కాదు.. 1000 శాతం సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది. భారత ప్రజల అండతో తప్పకుండా కిరీటం నెగ్గేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.