శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (10:55 IST)

అమెరికా ఎన్నికల్లో గూఢచర్య ఆరోపణలు.. 35 మంది రష్యా దౌత్యవేత్తలు వెనక్కి

అమెరికా ఎన్నికల్లో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా దౌత్యవేత్తలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బహిష్కరణ వేటు వేశారు. ఇందులోభాగంగా వీరంతా 72 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదే

అమెరికా ఎన్నికల్లో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా దౌత్యవేత్తలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బహిష్కరణ వేటు వేశారు. ఇందులోభాగంగా వీరంతా 72 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో 32 మంది రష్యా దౌత్యవేత్తలు అమెరికాను వీడి వెళ్లిపోతున్నారు. 
 
కొత్త సంవత్సరం రోజునే రష్యా దౌత్యవేత్తల విమానం మాస్కో బయల్దేరిందని అమెరికాలోని రష్యా కార్యాలయ దౌత్యవేత్త తెలిపారు. రష్యా అధ్యక్షుడు, ఇతర ముఖ్య అధికారులు ప్రయాణించే విమానంలో వీరిని మాస్కో చేర్చినట్లు ఆయన చెప్పారు. 
 
అయితే, అమెరికా భావి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఒబామా సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్డారు. రష్యా, అమెరికాలను హ్యాకింగ్‌ వ్యవహారానికి దూరంగా ఉంచాలన్నారు. అసలు కంప్యూటర్ల పనితీరునే నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు.