శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (13:17 IST)

''ఐ యామ్ ది బిగ్ సిస్టర్'': 4 ఏళ్ల చిన్నారి అదుర్స్.. ఒక్క ఫోన్ కాల్‌తో..?

ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో తన తల్లిని ఓ 4 ఏళ్ల చిన్నారి కాపాడుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారి సమయ స్ఫూర్తితో వ్యవహరించిన ఘటన అమెరికా మీడియాలో సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిచిగాన్ కలమజు ప్రాంతానికి చెందిన కలైజ్ మానింగ్ అనే నాలుగేళ్ల చిన్నారి ఒక్క ఫోన్ కాల్ చేసి తన తల్లిని కాపాడుకుంది.
 
తొమ్మిది నెలలు నిండిన తన తల్లి సెంటిరీయా పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. ఆ చిన్నారి కలైజ్ వెంటనే అత్యవసర సేవల విభాగం సర్వీస్ నెంబర్ 911కు ఫో చేసింది. ‘మా అమ్మ కిందపడిపోయి విలవిల్లాడిపోతోంది. ఆమె తొందరలో పిల్లాడిని ప్రసవించనుంది. ఆమెకు వెంటనే సహాయం కావాలి' అని ఫోన్లో చెప్పింది
 
లైజ్ ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించి రంగంలోకి దిగిన సిబ్బంది సెంటిరీయాను ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆమెకు ఓ బాబు జన్మించాడు. తల్లీ, కొడుకు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
 
కాగా, సమయ స్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలను కాపాడిన తన కూతురు కలైజ్‌ను చూసి సెంటిరీయా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు బుల్లి తమ్ముడు రావడంతో ‘ఐ యామ్ ది బిగ్ సిస్టర్' అనే అక్షరాలతో కూడిన టీ షర్టును ధరించిన కలైజ్ మురిసిపోయింది. ఇదిలా ఉంటే విపత్కర పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించిన కలైజ్ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి.