శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (12:14 IST)

సిక్స్ ప్యాక్ కోసం వర్కౌట్స్ చేస్తున్న 7 నెలల గర్భవతి.. ఎక్కడ?

సిక్స్‌ప్యాక్ సాధించాలంటే.. చాలా కష్టం అని అందరూ అనుకుంటారు. కానీ స్టాసీ వెంగ్రో అనే మహిళ ఫిట్నెస్‌కి మారు పేరు. సిక్స్‌ప్యాక్ లేడీ కూడా. ఇప్పటికే ఈమె మూడుసార్లు వరల్డ్ మిస్ ఫిట్నెస్ అమెరికా ప్రో.. అవార్డును తన సొంతం చేసుకుంది. అందుకేనేమో.. గర్భవతి అయినా కూడా ఫిట్నెస్‌ని వదలడం లేదు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. అయినా తాను సిక్స్‌ప్యాక్ కోసం పోరాటం చేస్తోంది. గర్భందాల్చివున్నా... తన సిక్స్‌ప్యాక్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. సిక్స్‌ప్యాక్ అంటే కష్టపడాలి కదా అంటారేమో! అంతలా కష్టపడుతోంది.. ఏమైనా జరిగితే అనే సందేహం వద్దు. 
 
ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. రోజూ డైట్ 200 క్యాలరీలను మించకుండా ఉంటే సరిపోతుందనే సలహా ఇచ్చాడట. దానికి తగినట్టుగానే ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్, తక్కువ డిన్నర్‌తో కానిస్తోంది స్టాసీ. తను స్ట్రెయిన్ కాకపోతే.. బరువులు ఎత్తినా పర్వాలేదన్న సూచన కూడా డాక్టర్ ఇచ్చాడంట. ఇంకా.. స్టాసీ తన వర్కవుట్లను డే అండ్ నైట్ కొనసాగిస్తోంది. స్టాసీ భర్త రేయింబవళ్లు తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడట. అందుకే తన ఈ సిక్స్‌ప్యాక్ సాధ్యమైందని స్టాసీ అంటున్నారు.