Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు ఫిట్స్ వచ్చింది.. ఎలా చనిపోయిందో చూడండి (వీడియో)

గురువారం, 29 జూన్ 2017 (12:40 IST)

Widgets Magazine

పాకిస్థాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. దీంతో రిపోర్టర్ చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం తానింకా బతికే వున్నానంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ న్యూస్ ఛానెల్ 'టీవీ 92'లో రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఇర్జా ఖాన్ అనే యువ‌తి చ‌నిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. లైవ్ నుంచి కిందపడిపోయిన మాట నిజమేనని.. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందాక తిరిగి ఇంటికొచ్చానని చెప్పింది. 
 
నిక్షేపంగా వున్న స‌ద‌రు యువ‌తి స్పందిస్తూ... తాను బ‌తికే ఉన్నాన‌ని.. తన‌కు సంబంధించిన వీడియో ఒక‌టి విప‌రీతంగా వైర‌ల్ అవుతోంద‌ని, అది ఓ పాత వీడియో అని, దాన్ని చూస్తూ అంతా తాను చ‌నిపోయాన‌ని అనుకుంటున్నార‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వాపోయింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే? ఇర్జా ఖాన్ ఏడాది క్రితం త‌మ చానెల్ త‌ర‌ఫున‌ ఓ కార్యక్రమం కవరేజ్ కోసం ఇస్లామాబాద్‌ వెళ్లింది. ఆ కార్య‌క్ర‌మ ప్రాంగ‌ణం మొత్తం కనిపించడం కోసం క్రేన్‌పై కూర్చొని లైవ్‌లో మాట్లాడుతోంది. ఒక్క‌సారిగా అస్వస్థతకు గురై ఫిట్స్ వచ్చి పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది.

అనంత‌రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా కెమెరాకు చిక్కిన ఓ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియో చూసినవారంతా ఇర్జా ఖాన్ మరణించిందని పోస్టులు పెడుతున్నారు. ఎలా చ‌నిపోయిందో చూడండ‌ని వీడియోను షేర్ చేస్తున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కారు టాప్ మీద కూర్చుని జర్నీ చేసిన చైనా యువతి.. (వీడియో)

తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువ‌తి దుస్సాహసం ...

news

తిరుపతిలో నిత్యపెళ్ళికొడుకు - ఎన్ని పెళ్ళిళ్ళు తెలిస్తే...!

నిత్యకళ్యాణం.. పచ్చతోరణం.. ఇది ఎప్పుడూ తిరుమలలో వినిపిస్తుంటుంది. స్వామివారి చెంత వివాహం ...

news

శిరీషపై అత్యాచారం జరగలేదా? ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చేసిందా? రాజీవ్-శిరీష భార్యాభర్తలని?

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుపై రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తోంది. దీంతో ...

news

రోజాను చూస్తే తుర్రుమని పారిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎందుకబ్బా?

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాను చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమడదూరం పారిపోతున్నారు. ...

Widgets Magazine