శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:43 IST)

నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ చనిపోయాడు.. ఆపై బతికాడు ఎలా?

నెలలు నిండకుండా పుట్టే పిల్లలు.. పుడుతూనే ఆరోగ్యపరమైన లోపాలను వెంట తెచ్చుకుంటారు. వీటిలో కొన్ని సమస్యలను వైద్యంతో నయం చేయగలిగినా కొన్ని మాత్రం వాళ్లని జీవితాంతం వేధిస్తాయి. ఇదిలా ఉంటే నెలలు నిండకుండా పుట్టిన బాబు చనిపోయాడనుకుంటే బతికి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన చైనాలోని జేఝియాంగ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పుట్టుకతోనే ఆరోగ్యలోపాలుండే ఈ చిన్నారిని 23 రోజులుగా ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. 
 
ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇంటికి పంపించారు. ఓ రాత్రి బాబు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుండె కొట్టుకోవడం మానేసింది. అనంతరం హాస్పటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ బాబు ఇకలేడని చెప్పారు. కన్నీరుమున్నీరుతో తల్లిదండ్రులు ఆ బాబు మృతదేహాన్నిశ్మశానవాటికకు తరలించారు. అక్కడ.. 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 గంటలపాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మధ్యాహ్నం సమయంలో ఆ బాబును డీప్ ఫ్రీజర్ నుంచి బయటకు తీయడంతోనే.. ఎవరో మూలుగిన చప్పుడు వినిపించడంతో బాబు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది గమనించారు. 
 
వెంటనే ఆ బాబును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. గుండె ఆగిపోయిందని నిర్ధారించిన తర్వాత ఆ పాప మళ్లీ బతకడం వైద్య పరిజ్ఞానానికి అంతుపట్టడం లేదని వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే బాబు మృతదేహాన్ని రెండు వరుసల గుడ్డలో.. ఓ మందపాటి బ్యాగులో డీప్ ఫ్రీజర్‌లో భద్రపరచడంతో బాబు బతకగలిగాడని వైద్యులు తెలిపారు.