శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 6 అక్టోబరు 2016 (22:17 IST)

#pakstandswithkejriwal, పాకిస్తాన్ దేశంలో కేజ్రీవాల్‌కి హీరోయిజం... ఎత్తేస్తున్నారు...

ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఓ ఇండియన్ పొలిటీషియన్ ను హీరో అయిపోయారు. ఇంతకీ ఎవరయ్యా ఆయన అంటే... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన గురించి పాకిస్తాన్ దేశంలో సామాజిక మాధ్యమాల్లో #pakstandswithkejriwal అనే ట్యాగు లైనును ఓ రేంజి ట్రెండింగుతో ముందుక

ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఓ ఇండియన్ పొలిటీషియన్ ను హీరో అయిపోయారు. ఇంతకీ ఎవరయ్యా ఆయన అంటే... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన గురించి పాకిస్తాన్ దేశంలో సామాజిక మాధ్యమాల్లో #pakstandswithkejriwal అనే ట్యాగు లైనును ఓ రేంజి ట్రెండింగుతో ముందుకు తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ అడిగినది ఏమంటే... భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను బయటపెట్టాలనేదే. 
ట్విట్టర్లో కేజ్రీపై వ్యంగ్యాస్త్రాలు
 
కేజ్రీవాల్ ఆ వీడియోను అలా గాల్లోకి వదిలారో లేదో పాకిస్తాన్ పట్టేసింది. పాకిస్తాన్ మీడియా ఆయ‌న‌ను పెద్ద హీరో కింద మార్చేసింది. సోషల్ మీడియాలో అయితే ఆయనను హీరోగా చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ త‌ప్ప‌ భారతదేశంలో మిగిలినవారంతా భార‌త ప్ర‌ధాని మోదీ, ఆర్మీ చేతుల్లో ఫూల్స్ అయ్యారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 
 
ఇండియాలో ప్రధాని మోదీని ధైర్యంగా నిలదీసే సత్తా ఒక్క కేజ్రీవాల్ కు మాత్రమే ఉన్నదంటూ కీర్తిస్తున్నారు. కాగా పాకిస్తాన్ అరవింద్ కేజ్రీవాల్ పట్ల చేస్తున్న కామెంట్లను చూసిన కొందరు భారతీయులు స్పందిస్తూ.. ఐతే కేజ్రీవాల్ ను మీ దేశానికి తీసుకువెళ్లండి అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.