Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ.. 2022 నాటికి 7లక్షల ఉద్యోగాలు గోవిందా!

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:37 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నాటికి 6.4 లక్షల ఐటీ ఉద్యోగులు తమ కొలువు కోల్పోతారని అంచనా వేసింది. దీంతో ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి రోబోటిక్ ప్రోసెస్ ఆటోమేషన్ కారణమని సదరు సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. 
 
అమెరికా కేంద్రంగా పనిచేసే హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోతారని పేర్కొంది. అయితే ఉన్నత, మధ్య స్థాయి ఉద్యోగులు లక్ష నుంచి 1.9లక్షలకు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొన్నారు. 
 
ఆటోమేషన్ వల్ల ఉన్నత స్థాయి నైపుణ్యాల ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. ఈ క్రమంలో అంచనాలు సవరిస్తే.. నాటికి ఏడు లక్షల ఉద్యోగాలు ఊడుతాయని సంస్థ షాక్ ఇచ్చింది. లోస్కిల్స్ కారణంగా ఐటీ ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఎక్కువగా వుందని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.
 
ఆటోమేషన్‌పై ఖర్చూ చేస్తే మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఐటీ సంస్థలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కంపెనీలు కోతలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమేషన్ ఎఫెక్ట్ మొదలైంది. హైదరాబాదులో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గాయి. 
 
ఖర్చు తగ్గించుకునే దిశగా ఐటీ సంస్థలు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎంట్రీ లెవల్‌పై తీవ్ర ప్రభావం పడింది. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో ఇప్పటికే ఆటోమేషన్ ట్రైనింగ్ ప్రారంభమైంది. దీంతో హైదరాబాదుతో పాటు భారతీయ ఐటీకి కష్టాలు తప్పవని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య... నిజం రాస్తే పాయింట్ బ్లాంక్ మర్డర్లే...

బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ ...

news

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. ఉజ్బెక్ మహిళపై కారులో గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన ఒకటి జరిగింది. ఉజ్బెకిస్థాన్ మహిళపై కారులో గ్యాంగ్ ...

news

ఉత్తర కొరియా అణు పరీక్ష... పైకెగిరిన కొండ... కంపించిన చైనా సరిహద్దు...

ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష ధాటికి ఆ దేశంలోని పలు కొండచరియలు ...

news

హరికేన్ 'ఇర్మా'లో చిక్కుకున్న ఫ్లైట్ ... భయానక వీడియో

కరేబియన్ దీవులను హరికేన్ 'ఇర్మా' అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను క్షణక్షణానికి ఉగ్రరూపం ...

Widgets Magazine