శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:45 IST)

మద్యం.. ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందట.. రోజుకు 15 మంది..?

మద్యం ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందని తాజా అధ్యయనం తేలింది. మద్యం తాగుతున్నవారిలో రోజుకు 15 మంది ఆస్ట్రేలియన్లు మరణిస్తున్నారని తాజా నివేదిక తేల్చింది. అలాగే 430 మంది ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపింది. 
 
మద్యం తాగుతున్నవారిపై విక్హెల్త్ అండ్ ఫౌండేషన్ ఫర్ అల్కహాల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఆర్ఈ) ఓ సర్వే నిర్వహించింది. 2010 నాటి నుంచి గణాంకాలు ఆధారంగా మద్యం సేవిండం వల్ల 5554 మంది మృతి చెందారని, 157,132 మంది ఆసుపత్రి పాలైయ్యారని ఎఫ్ఏఆర్ఈ వివరించింది.
 
మద్యం సేవించడం వల్ల మృతి చెందుతున్న ఆస్ట్రేలియన్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని తెలిపింది. గతంలో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేదని అయితే గత దశాబ్ద కాలంలో 62 శాతం మేర మృతుల సంఖ్య పెరిగిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మైఖేల్ త్రొన్ వెల్లడించారు.