శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:50 IST)

భారతీయుడిపై అకారణంగా దాడి : అమెరికా పోలీసుకు జైలు!

తన కుమారుడిని చూసేందుకు వెళ్లిన భారతీయుడిపై అకారణంగా దాడి చేసిన పోలీసుకు అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా చట్టం ప్రకారం పౌరులకు అండగా నిలవాల్సిన పోలీసులు ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. దీంతో భారతీయుడిపై అకారణంగా దాడికి పాల్పడిన పోలీస్ అధికారి ఎరిక్ పార్కర్‌కు పదేళ్ల జైలు ఖాయమంటున్నారు న్యాయనిపుణులు. 
 
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మాడిసన్ నగర శివారులో కొత్త ఇల్లు కొనుకున్న భారత సంతతికి చెందిన ఇంజనీరు చిరాగ్ పటేల్ తన ఏడాదిన్నర కొడుకును చూసుకోవడానికి తండ్రి సురేష్‌భాయి పటేల్‌ను పిలిపించుకున్నాడు. ఇతనికి ఇంగ్లీష్ రాదు. ఇంటికి ఎదురుగా రోడ్డు ప్రక్కగా వాకింగ్ చేస్తుండగా ముగ్గురు పోలీసులు ఈయనను అటకాయించారు. పోలీసులు అడిగే ప్రశ్నలు అర్థంకాక నో ఇంగ్లీష్, ఇండియన్ అనే పదాలను మాత్రమే ఉచ్ఛరించాడు.
 
అయితే వృద్ధుడు చెప్పే మాటలేవి పట్టించుకోకుండా పోలీసులు ఒక్కసారిగా కాళ్లపై తన్ని కిందకు పడేసి, చేతులు రెండు వెనక్కి విరిచి మీదకూర్చున్నారు. ఈ ఘటనలో వృద్ధుడి తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. దాంతో ప్రస్తుతం పక్షవాతానికి గురైన సురేష్‌భాయి పటేల్‌ గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసులో పోలీస్ అధికారి వైఖరిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.