ఇవాంకకు ఐసిస్ ముప్పు.. కళ్లు చెదిరే కాన్వాయ్‌లతో.. (Video)

మంగళవారం, 28 నవంబరు 2017 (11:42 IST)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనలో వున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంప్‌పై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు వేస్తోందని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారుల నుంచి సమాచారం అందడంతో.. ఇజ్రాయేల్ రక్షణ పరికరాలను రంగంలోకి దించారు. ఇప్పటికే పదివేల మందికిపైగా పోలీసులు పహారా కాస్తుండగా.. ఎనిమిది మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అనుక్షణం ఇవాంకకు భద్రత కల్పిస్తున్నారు. 
 
ఇక ఐఎస్ ముప్పు వుందని అమెరికా సీక్రెట్ సర్వీస్ హెచ్చరించడంతో నగరంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న అనుమానం ఉన్న 200 మందిపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇవాంకకు భద్రత కల్పించేందుకు ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన ప్రత్యేక పరికరాలను సిద్ధం చేసుకుంది. వీటికితోడు ఆమె ఉన్న ప్రాంతాలపై శాటిలైట్ నిఘా పెట్టారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారులో భారీ భద్రత నడుమ ఇవాంకా ప్రయాణాలు సాగనున్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.
 
మరోవైపు మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇవాంకా.. భారీ భద్రత మధ్య టైడెంట్ హోటల్‌కు కళ్లు చెదిరే వాహనాలతో చేరుకున్నారు. ఆపై హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌లో ఇవాంకా పాల్గొంటారు. వేదికను ఆమెతో పాటు భారత ప్రదాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచుకోనున్నారు. దీనిపై మరింత చదవండి :  
India Us Is Ges Ivanka Trump High Alerts

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆడ, మగ అనే భేదం విడనాడాలి : జగ్గీవాసుదేవ్‌

ఆడ, మగ అనే లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా ...

news

ఆర్కే నగర్ ఎన్నికలు: అన్నాడీఎంకేలో లుకలుకలు.. అమృతకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తారా?

ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైనా.. రెండాకుల చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ వారికే ఇచ్చినా.. ఆర్కే ...

news

బిత్తిరి సత్తిపై దాడి ఎందుకంటే?: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ వీ6లో తీన్మార్ వార్తలతో ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తిపై ...

news

#GES2017 : రారండోయ్‌... వేడుకలు చూద్దాం...

భాగ్యనగరం రెండు పండుగలకు ఆతిథ్యమివ్వనుంది. అందులో ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్ ...