సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మే 2022 (09:21 IST)

న్యూయార్క్ రాష్ట్రంలో గర్జించిన తుపాకీలు.. పది మంది మృతి

gunshoot
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మరోమారు తుపాకులు గర్జించాయి. ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో పది మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం న్యూయార్క్ రాష్ట్రంలోని బఫె నగరంలో ఉన్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లోకి ఓ అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కాల్పుల ఘటనను తన హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సూపర్ మార్కెట్‌ ప్రాంగణంలోని చొరబడిన దుండగుడు అక్కడి వున్న వారిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత వెళ్ళిపోతూ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ విషయం హెల్మెట్‌కు అమర్చిన కెమెరా దృశ్యాల ద్వారా తెలుస్తుంది. 
 
కాగా, ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ పోలీస్ అధికారి ఆ సూపర్ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. తాజా కాల్పుల్లో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పుల వెనుకవున్న లక్ష్యం మాత్రం తెలియరాలేదు.