శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (13:51 IST)

బంగ్లాదేశ్ జమాత్ ఇ ఇస్లామీ నేతకు ఉరిశిక్ష : ఢాకా కోర్టు

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ అధినేత మొతిర్ రెహమాన్ నిజామి (71)కు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ మేరకు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు బుధవారం తీర్పునిచ్చింది. 
 
1971లో ఆ దేశ స్వాతంత్య్రోద్యమ సమయంలో పాకిస్థాన్‍‌ - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది బంగ్లా పౌరులు చనిపోయారు. దీనికి జమాత్ అధినేతే కారణమంటూ పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒకప్పటి ఆ దేశ మాజీ మంత్రి అయిన నిజామిపై మారణహోమం, హత్య, హింస, అత్యాచారం, ఆస్తి నాశనం వంటి పదహారు రకాల ఆరోపణలు మోపి విచారణ జరిపారు. 
 
ఈ కేసుల విచారణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా, ఈ కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఇందులోభాగంగా రెహమాన్ నిజామిపై మోపిన అభియోగాలు నమోదు కావడంతో ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.