శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:24 IST)

కెనడా మహిళపై యోగా గురువు అత్యాచారం.. ఎక్కడ.. ఎపుడు!

మనస్సు ప్రశాంతత కోసం యోగా సాధన చేస్తుంటారు. కానీ, ఆ యోగా శిక్షణ ఇచ్చే ఓ గురువే కెనడా దేశానికి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో వాంకోవర్ కేంద్రానికి చెందిన యోగా గురువు విక్రమ్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ శిక్షణా కేంద్రంలో యోగా సాధన చేసిన తనపై గత మూడేళ్ళలో ఆయన తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని, బలవంతంగా అనుభవించాడని ఓ కెనడా మహిళా కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానంలో కేసు వేసింది. కాగా, విక్రమ్ చౌదరిపై ఇప్పటికే ఇవే తరహాలో 5 కేసులు నమోదయ్యాయి. తొలి కేసు ఆగస్టులో విచారణకు రానుంది.
 
బాధితురాలు 18 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఆయన వద్దకు యోగాలో శిక్షణ కోసం 2010లో వెళ్లిందని బాధితురాలి తరపు లాయర్ తెలిపారు. ఆయన తాకకూడని చోట తాకేవాడని, తనతో హోటల్ రూంకు తీసుకు వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడని వివరించారు. ఆపై ఆమె శిక్షకురాలిగా ఆయన వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు పలుమార్లు వేధింపులు కొనసాగాయని తెలిపారు. 
 
ఆయనకు నగరంలో ప్రముఖులతో పరిచయాలు ఉండడంతో తన క్లయింటు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారని, దీనికితోడు నా మాట వినని ప్రజలు చనిపోతారు అని విక్రమ్ చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలను విక్రమ్ తరపు న్యాయవాది కొట్టిపారేశారు. ఆయనపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదని గుర్తు చేశారు.