బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (11:12 IST)

ట్రంప్ నా భార్యను గదికి పిలిచి లైంగిక దాడి చేయబోయాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్లను వేధించిన విషయంలో హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ''మీ టూ'' అనే హ్యాష్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్లను వేధించిన విషయంలో హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ''మీ టూ'' అనే హ్యాష్ ‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కథనాలు సంచలనం రేపుతున్నాయి. ఇదే హ్యాష్ ట్యాగ్‌తో సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు సంబంధించిన అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు.
 
మీ టూ హ్యాష్ ట్యాగ్‌లో హాలీవుడ్ తారలే కాదు.. బాలీవుడ్ తారలు కూడా తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ హీరో బిల్ బ్లాడ్ విన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. ట్రంప్ తన భార్యను లైంగికంగా వేధించాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమం కోసం వెళ్ళిన తన భార్య చెన్యా ఫిలిప్‌పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బిల్ ఆరోపించాడు. ఆ ప్రోగ్రామ్‌కు తన భార్యతో పాటు తాను కూడా వెళ్లానన్నాడు. 
 
ఆ సమయంలో ఒంటరిగా ఆమెను గదిలోకి పిలిచిన ట్రంప్ ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని బిల్ బ్లాడ్ విన్ ఆరోపించాడు. ఇలా మహిళలను లైంగికంగా వేధించడంలో హలీవుడ్ నిర్మాత అల్ ఫ్రాకేన్‌ను ట్రంప్ ఐదు రెట్లు మించిపోయాడని విమర్శించారు. 
 
తన భార్యను ట్రంప్ గదిలోకి పిలిచి లైంగిక దాడి చేయాలనుకోవడమే కాకుండా ఆమెను బలవంతంగా తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని వెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడని బిల్ బ్లాడ్ విన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బిల్ బ్లాడ్ విన్ వ్యాఖ్యలు సంచలనానికి దారితీస్తున్నాయి. నెటిజన్లు ట్రంప్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
 
కాగా 1980-2013 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ 16 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.