శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:34 IST)

సిరియాలో దారుణం.. రసాయన దాడులు చేసిన ప్రభుత్వ బలగాలు

సిరియాలో దారుణం జరిగింది. ఆ దేశ భద్రతా బలగాలు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని రసాయన దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు వెయ్యి మంది వరకు చిన్నారులు చనిపోయినట్టు సమాచారం.

సిరియాలో దారుణం జరిగింది. ఆ దేశ భద్రతా బలగాలు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని రసాయన దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు వెయ్యి మంది వరకు చిన్నారులు చనిపోయినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా సిరియాలో ప్రభుత్వ బలగాలు, రెబెల్స్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడులు రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయి. 
 
లేటెస్ట్‌గా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. రెబల్స్ టార్గెట్‌గా కెమికల్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అన్నెంపుణ్యం ఎరుగని 100 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది చిన్నారుల ఆచూకీ లభించలేదు. ఆస్పత్రులన్నీ చిన్నారులతో నిండిపోయాయి. చికిత్స అందించటానికి కూడా సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు వైద్యులు. 
 
కాగా, ప్రభుత్వ దళాలు కెమికల్ దాడులకి దిగటంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారని.. వెంటనే అంతర్యుద్దాన్ని ఆపాలని ప్రపం దేశాలు డిమాండ్ చేశాయి. అయితే, తాము రసాయన దాడులకు పాల్పడలేదని సిరియా ప్రభుత్వ బలగాలు ప్రకటించాయి.