శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 అక్టోబరు 2014 (14:48 IST)

మిస్టర్ ఒబామా... డోంట్ టచ్ మై గర్ల్ ఫ్రెండ్... ఓ ఘాటు ప్రియుడు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను షాక్ తినిపించాడు ఓ యువకుడు. చికాగోలో ఓటు వేసేందుకు వెళ్లిన ఒబామా ఓ మహిళ వెనుక నిలబడ్డారు. ఒబామా వెనుకే ఉన్న మైక్ జోన్స్ అనే అతడు... "మిస్టర్ ఒబామా... డోంట్ టచ్ మై గర్ల్ ఫ్రెండ్" అనేసరికి ఒబామా షాక్ తిన్నారు. ఐతే ఆ తర్వాత జోన్స్ తీరిగ్గా చెపుతూ... ఏదో సరదాగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలని అలా అన్నట్లు చెప్పాడు. 
 
కాగా ప్రెసిడెంట్ తన వెనుక ఉన్నారని తెలియగానే కూపర్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా... అంతలో ప్రియుడు జోన్స్ ఈ మాట అనడంతో ఆమె కూడా షాక్ తింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసుకుని రిలాక్సయ్యారు. జోన్స్ మాటలపై ప్రియురాలు కూపర్ ఒబామాకు సారీ కూడా చెప్పింది. ఐతే ఆ తర్వాత ఒబామా కూపర్ ను కౌగలించుకుని, ముద్దు కూడా పెట్టి, ఇప్పుడు నిజంగా నీ బాయ్ ఫ్రెండ్ కుళ్లుకుంటాడు చూడు అని వెళ్లిపోయారు.