శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (16:34 IST)

22 ఏళ్ల పాటు కడుపు ఉబ్బరం.. కారణం.. కిలోల కొద్ది పేరుకుపోయిన..?

కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడు

కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడుపు ఉబ్బరం నుంచి అతనికి విముక్తి లభించింది. 
 
ఇన్ని సంవత్సరాల పాటు కడుపు ఉబ్బరానికి కారణం పెద్ద పేగులో కిలోల కొద్ది పేరుకుపోయిన మలమేనని వైద్యులు తెలిపారు. అరుదుగా సంక్రమించే ఈ వ్యాధిని 'హిర్ష్‌ప్రంగ్'గా పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. మూడు గంటల పాటు శ్రమించి పెద్ద పేగు నుంచి పేరుకుపోయిన మలం కణితిని తొలగించామన్నారు.
 
ఏకంగా 13కేజీల మలాన్ని అతని ఉదరం నుంచి తొలగించినట్లు షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నాడని.. పెద్ద పేగులో లోపాలు ఉండటం వల్ల పుట్టినప్పటి నుంచి అతను మలవిసర్జన చేయలేకపోయాడని వైద్యులు తెలిపారు. తొమ్మిది నెలల గర్భాన్ని పోలిన కడుపుతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని వైద్యులు చెప్పారు. అతని కడుపు నుంచి తొలగించిన కణితి 30 అంగుళాలున్నదని వైద్యులు చెప్పారు.