శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (16:01 IST)

చైనాలో నకిలీ స్టూడెంట్స్‌కు యమా గిరాకీ.. నెలకు రూ.10వేల జీతం.. 700 గ్రూపులు?

చైనాలోని బీజింగ్ కళాశాల-విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు తమకు బదులుగా తరగతులకు హాజరయ్యేందుకు అద్దె విద్యార్థులను వాడుకుంటున్నారట. వారానికి ఐదు క్లాసులు, 2 వారాలు, ఒక నెల, 6 నెలలంటూ విద్యార్థులు క

చైనాలోని బీజింగ్ కళాశాల-విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు తమకు బదులుగా తరగతులకు హాజరయ్యేందుకు అద్దె విద్యార్థులను వాడుకుంటున్నారట. వారానికి ఐదు క్లాసులు, 2 వారాలు, ఒక నెల, 6 నెలలంటూ విద్యార్థులు క్లాసులకు హాజరుకాకుండా అద్దె విద్యార్థులను పంపుతున్నారు. దీంతో అద్దెకు లభించే విద్యార్థులకు భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
అద్దె విద్యార్థులను క్లాసులకు పంపే విద్యార్థులు తమ ఐడీ కార్డుల్లో వారి ఫోటోలను అంటించి.. నకిలీ ఐడీ కార్డులతో తరగతులకు పంపిస్తున్నారు. ఆంగ్లం, చైనా వంటి క్లాసులకు పంపే అద్దె విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఇలా అద్దెకు వచ్చే విద్యార్థులకు నెలకు పదివేల చొప్పున జీతం ఇస్తున్నారు. 
 
ఇంటర్నెట్‌లో 700 గ్రూపులు అద్దె విద్యార్థులు పనిచేస్తున్నారు. ఒక్కో గ్రూపుకు 200 నుంచి 300 వరకు విద్యార్థులుంటారు. బీజింగ్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటంతో అద్దెకొచ్చే, నకిలీ విద్యార్థులను కనిపెట్టడం కష్టమవుతుందని ప్రొఫెసర్లు చెప్తున్నారు.