కొలంబియా విమాన ప్రమాదం... ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులతో సహా 81 మంది మృతి

మంగళవారం, 29 నవంబరు 2016 (12:29 IST)

plane crash

బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. ఆ దేశానికి ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన క్రీడాకారులంతా చనిపోయారు. బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఈ విమానం కొలంబియా శివారు ప్రాంతంలోని పర్వతశ్రేణుల్లో కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందులో ఓ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులతో పాటు.. మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మృత్యువాతపడినట్టు భావిస్తున్నారు.
 
మొత్తం 81 మందితో వెళుతున్న సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ 81 మందిలోనే బ్రెజిల్‌‌లోని చాపెకోఎన్సో ఫుట్‌‌బాల్‌ అసోసియేషన్ అనే ఓ క్లబ్బుకు చెందిన ఫుట్‌ బాల్ క్రీడాకారులు ఉన్నారు. ఈ విమానం కొలంబియాలోని మెడిలిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.
 
బొలివియా నుంచి బయలు దేరిన ఈ విమానం కొలంబియా చేరుకునే సమయంలోనే రాడార్‌ నుంచి నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది నగరం శివారు ప్రాంతాల్లోని పెద్ద పర్వాతాల్లో కూలిపోయినట్లు గుర్తించినట్లు మెడిలిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా చెప్పారు.
 
కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. బ్రెజిల్‌ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ విమానం కూలిపోయింది. ఇంధనం లేక విమానం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీలో టీడీపీ - బీజేపీ స్నేహబంధానికి కటీఫ్? ఆ పత్రిక సర్వే ఫలితమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహబంధానికి కటీఫ్ ఏర్పడే పరిస్థితులు ...

news

రమ్య మళ్లీ వివాదంలో చిక్కుకుంది.. యువకుడితో వాగ్వివాదం.. అనుచరులతో దాడి..

మాజీ కాంగ్రెస్ ఎంపీ, నటీమణి రమ్య మళ్ళీ వివాదంలో చిక్కుకుంది. ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఓ ...

news

అర్థరాత్రి బయటకు పంపి గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసున్న అన్ను చంపిన తమ్ముడు

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...

news

జవాన్ తలను కిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముంది: భారత ఆర్మీ

జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ ...