శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (12:31 IST)

భ్రూణహత్య... ఎన్నారై మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష..!

ఇటీవల వివాహానికి ముందే సెక్స్‌లో పాల్గొనడం, అక్రమ సంబంధాలు వంటి పలు కారణాల వలన గర్భందాల్చే మహిళల్లో భ్రూణహత్యలకు పాల్పడుతున్న సంఖ్య పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలలో భ్రూణహత్య చట్ట రీత్యా నేరం. 
 
తాజాగా భ్రూణహత్య, గర్భ విచ్ఛిత్తికి పాల్పడ్డారన్న అభియోగాలపై భారత సంతతికి చెందిన 33 ఏండ్ల మహిళ పూర్వీ పటేల్‌కు అమెరికా కోర్టు 30 ఏండ్ల జైలుశిక్ష విధించింది. అదనంగా మరో ఐదేండ్లు ప్రొబేషన్ శిక్షను అనుభవించాలని ఆదేశించింది. 
 
భారత దేశానికి చెందిన పూర్వీ పటేల్ 2013లో విపరీతమైన రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు గర్భస్రావం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. పిండాన్ని బ్యాగులో పెట్టి.. ఆ బ్యాగ్‌ను చెత్తకుప్పలో పడేసినట్లు వైద్యుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెపై అక్రమ గర్భస్రావం, ఇతర నేరాలను మోపి కేసు నమోదు చేశారు.