శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (15:05 IST)

సొరంగ మార్గాలను గుర్తించారు... కొత్త రాడార్‌‌ను కనుగొన్నారు.. ఇక ఆటలు చెల్లవ్..‌‌

సరిహద్దు వద్ద పాక్ ఆటలకు కళ్లెం వేసేందుకు రంగం సిద్ధమైంది.సాంబ, ఉరి ఉగ్రవాద దాడులను పరిశీలించినపుడు ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించేందుకు సొరంగాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో సొరంగ మార్గాలతో పాట

సరిహద్దు వద్ద పాక్ ఆటలకు కళ్లెం వేసేందుకు రంగం సిద్ధమైంది.సాంబ, ఉరి ఉగ్రవాద దాడులను పరిశీలించినపుడు ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించేందుకు సొరంగాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో సొరంగ మార్గాలతో పాటు ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు భారత్ సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సరిహద్దుల ఆవలి నుంచి మన దేశంలోకి సొరంగాలు ఉన్నట్లు గుర్తించామని సరిహద్దు భద్రతాదళం చెప్పింది. 
 
కేంద్ర ప్రభుత్వం సొరంగాలను, తుపాకీ పేలుళ్ళను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తోంది. ఐఐటీ-బెంగళూరులోని అంతర్గత భద్రత కోసం జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కేంద్రం (ఎన్‌సీఈటీఐఎస్) 920 మెగా హెర్ట్‌జ్ వద్ద భూగర్భంలోని విషయాలను గ్రహించగలిగే రాడార్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ సొరంగాలను మాత్రమే కాకుండా మందుపాతరలను కూడా గుర్తించగలదు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇతర ఐఐటీల సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఈ ఎన్‌సీఈటీఐఎస్ ప్రాజెక్టు మేనేజర్ సీమా పెరివాల్ మాట్లాడుతూ ఈ రాడార్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. దీనిని ఫిబ్రవరిలో క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని తెలిపారు.
 
ఇకపోతే.. ఈ సొరంగాల్లో శ్వాస తీసుకోవడానికి సదుపాయాలు ఉన్నట్లు తెలిపింది. పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్థావరానికి 58 కి.మీ. దూరంలో 20 అడుగుల సొరంగాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. 2001 నుంచి 2016 మధ్య కాలంలో 8 సొరంగాలను గుర్తించారు. వీటిలో ఒకదానిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు, మిగిలినవాటిని ఉగ్రవాద చొరబాట్లకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.