మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By mohan
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (18:08 IST)

వామ్మో లేడీ బాహుబలి... ఏం చేసిందంటే?

బాహుబలి చిత్రంలో హీరో ఎంత బలశాలో మనం చూశాం. కానీ ఇప్పుడు ఒక లేడీ బాహుబలిని చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. కజికిస్థాన్ దేశానికి చెందిన దార్యా నెస్టెరోవా అనే ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ మరియు బాడీబిల్డర్ ఏకంగా 50 మంది ప్రయాణీకులున్న 22 టన్నుల బరువు గ

బాహుబలి చిత్రంలో హీరో ఎంత బలశాలో మనం చూశాం. కానీ ఇప్పుడు ఒక లేడీ బాహుబలిని చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. కజికిస్థాన్ దేశానికి చెందిన దార్యా నెస్టెరోవా అనే ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ మరియు బాడీబిల్డర్ ఏకంగా 50 మంది ప్రయాణీకులున్న 22 టన్నుల బరువు గల ట్రామ్‌ని లాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కెమెరాలో బంధించారు వీక్షకులు. 
 
కజికిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన అల్మటీలో జూన్‌ నెలలో జరిగే కెనిద్లిఫెస్ట్ అనే పండుగలో భాగంగా ట్రామ్‌ని లాగి దార్యా లేడీ బాహుబలి అనిపించుకుంది. ఈ ట్రైనింగ్ సెషన్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో పంచుకుంది. తనకు ఇది పెద్ద సవాలు అయినప్పటికీ, వర్క్అవుట్‌లో భాగంగా భారీ ట్రామ్‌ని లాగడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది ఈ సూపర్ ఉమెన్. అంతే కాకుండా తాను లాగడం మొదలు పెట్టిన తర్వాత, అక్కడ ఆ సన్నివేశాన్ని ఆత్రుతగా చూస్తూ, తనని ప్రోత్సహించిన వారికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధన్యవాదాలు కూడా తెలిపింది.