శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (13:22 IST)

మిలటరీలో హిజ్రాలు పనికిరారు: వెనక్కి తగ్గని డొనాల్డ్ ట్రంప్

సైన్యంలో పనిచేసేందుకు హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేశారు. దేశీయ మిలటరీలో హిజ్రాలు చ

సైన్యంలో పనిచేసేందుకు హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేశారు. దేశీయ మిలటరీలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ సంతకం చేశారు.

ట్రంప్ నిర్ణయాన్ని ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు. అయితే సైన్యంలో వారి సేవలు అవసరం లేదని.. వారికి అయ్యే ఖర్చులు భరించలేమని ట్రంప్ స్పష్టం చేశారు.  
 
హిజ్రాల నియామకాలను నిషేధిస్తామంటూ గతంలోనే ట్రంప్ ప్రకటించారు. దీంతో, అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయంపై హిజ్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ తన నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ఫలితంగా రక్షణ సేవల్లో హిజ్రాల సేవలు, వారి నియామకాలు రద్దు కాబోతున్నాయి.

హిజ్రాలకు కేటాయిస్తున్న నిధులను వెంటనే ఆపివేయాలని దేశీయ డిఫెన్స్ డిపార్ట్ మెంట్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్‌లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.